calender_icon.png 10 February, 2026 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెవీ నిర్ణీత గడువులో పూర్తి చేయాలి

10-02-2026 06:01:39 PM

- కస్టమ్ మిల్లింగ్ రైస్ లెవీపై అధికారుల ఆదేశాలు

- లెవీ అమలులో మిల్లర్లు సహకరించాలి

- పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్

మునుగోడు,(విజయక్రాంతి): కస్టమ్ మిల్లింగ్ రైస్ (లెవీ)ని సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ మిల్లర్లకు స్పష్టం చేశారు. మంగళవారం మునుగోడులోని మల్లికార్జున రైస్ మిల్లులను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. లెవీని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇప్పటికే మిల్లర్లకు సూచనలు జారీ చేశామని తెలిపారు. వడ్ల సేకరణలో నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆయన వివరించారు. లెవీని  త్వరగా పూర్తి చేసి, జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేందుకు మిల్లర్లు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. లెవీ పూర్తిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.