22 July, 2026 | 10:56 AM

సీసీ రోడ్డు నాణ్యత పట్టించుకోని అధికారులు?

22-07-2026 10:11 AM

ఇసుక కలపకుండా డస్ట్ తోనే రోడ్డు నిర్మాణ పనుల వైనం

సిమెంట్, కంకరలో 20- 30% ఇసుక కలపాలని నియమాలు తుంగలో తొక్కుతున్న కాంట్రాక్టర్

సిసి రోడ్డు పనులు పర్యవేక్షించని,ఆర్ అండ్ బి అధికారులు

తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనదారుల ప్రయోజనాల దృష్ట్యా తుంగతుర్తి మెయిన్ రోడ్ లో స్థానిక జూనియర్ సివిల్ కోర్టు సమీపంలో, సంబంధిత కాంట్రాక్టర్ సి సి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నాడు. గడిచిన రెండు సంవత్సరాల క్రితం మెయిన్ రోడ్డుపై సీసీ నిర్మాణ పనులకు, ప్రభుత్వం టెండర్లు పిలవగా సదర్ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. నాటి నుండి నేటి వరకు నిర్మాణ పనులు నిర్లక్ష్యం కాగా, ప్రస్తుతం వాన కాలంలో తేరుకొని, ఒకింత నిర్మాణం చేపడుతున్నాడు.

దీనిలో ప్రస్తుతం సిమెంటుకు సరిపడా కంకర, ఇసుక వాడాల్సి ఉండగా, ఇసుక లేకుండా, తన కంపెనీలో తయారైన డిష్ ను పట్టుకొచ్చి, సిమెంటు, కంకర, నీరు మిశ్రమంతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు జోరుగా వస్తున్నాయి. ఒకటి రెండు ట్రక్కుల, ఇసుక తీసుకొచ్చి, ప్రక్కనే పెట్టి ,పోయకుండా, జోరుగా సిసి రోడ్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. జరిగిన సంఘటనపై, ఆర్ అండ్ బి అధికారులు, జిల్లా కలెక్టర్ విచారణ జరిపి, నాణ్యత మైన, మెయిన్ రోడ్డుపై సిసి రోడ్ నిర్మాణం చేపట్టాలని, వివిధ పార్టీ నాయకులు, గ్రామస్తులు కోరుతున్నారు.