23 June, 2026 | 4:00 AM

తిక మక సమాధానాలు చెప్పిన అధికారులు..

23-06-2026 12:00 AM

- వివిధ శాఖల అధికారులతో  ఎమ్మెల్యే సమీక్ష

చేగుంట, జూన్ 22 : చేగుంట ఎంపీడీఓ  కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి  మండలంలో పని చేసే అన్ని శాఖల జిల్లా, మండల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు, వివిధ శాఖలతో అధికారులతో కలిసి ఒకరికొకరు సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.

మండలం అన్ని గ్రామాలలో డ్రైనేజీ, తాగునీరు సమస్యను , విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, చెరువులను కాపాడి అధునీకరించాలని, వివిధ సమస్యలపై సర్పంచ్ లు అడిగిన సమావేశంలో అధికారులు తడపడ్డారు. ముఖ్యంగా మండల విద్యాధికారి నీరజ ను రెడ్డిపల్లి లో ఉన్న ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థుల సంఖ్యను అడుగగా తప్పులు చెప్పడంతో, మీకు మండలంలో ఉన్న పాఠశాలపై పూర్తి అవగాహన లేకుండా ఎలా ఉద్యోగం చేస్తున్నారని మండిపడ్డారు.

అలాగే, విద్యుత్, ఆరోగ్యశాఖ మండల అధికారులు కూడా తిక మక సమాధానం చెప్పడంతో వారి పైన మండి పడి, ఇప్పటికైనా మీరు చేస్తున్న ఉద్యోగంపై పూర్తి అవగాహన కలిగి ఉద్యోగ ధర్మాన్ని కాపాడలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, మండల అధికారులు, ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి, సర్పంచ్ లు, పంచాయతీ సెక్రటరీ లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.