23 June, 2026 | 5:04 AM

ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ

23-06-2026 12:00 AM

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, జూన్ 22 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి ప్రజావాణిలో దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 125 ప్రజలు దరఖాస్తులు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.

ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.భూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, పింఛన్లు, రెవెన్యూ తదితర అంశాలకు సంబంధించిన వినతులు ప్రజావాణిలో అందాయని  ,  దూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రాకుండా ఆయా డివిజన్ పరిధిలో తమ అర్జీలను సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్ వి గిరి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్, డిఆర్‌ఓ పాండు, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.