12 May, 2026 | 2:41 AM

పోలవరం ఫేజ్-2పై అభ్యంతరం

12-05-2026 12:38 AM
  1. లిఫ్ట్ స్కీమ్ పనుల పునఃప్రారంభానికి ఏపీ సర్కార్ ప్రయత్నాలు
  2. అడ్డుకోవాలని పీపీఏకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
  3. బ్యాక్‌వాటర్, ముంపు, డ్రెయినేజీ సమస్యపై పూర్తిస్థాయి సర్వే చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి) : పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫేజ్-2 పనులను పునః ప్రారంభించే ప్రయత్నాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫేజ్--2 కింద 45.72 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ స్థాయిలో నీటి నిల్వ చేయడానికి ముందు, తెలంగాణలో కలిగే ముంపు, డ్రెయి నేజీ సమస్యలు, బ్యాక్‌వాటర్ ప్రభావంపై పూర్తి స్థాయి సంయుక్త సర్వే చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్- ఇన్- చీఫ్ (జనరల్) ఓ.వి. రమేష్‌బాబు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సీఈఓకు లేఖ రాశారు. 

ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ దాఖలు చేసి న ఒరిజినల్ సూట్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పి టిషన్ల నేపథ్యంలో కేంద్ర జల సంఘం చైర్మన్ ఆ ధ్వర్యంలో జరిగిన నాలుగు సాంకేతిక సమావేశా ల్లో సంయుక్త సర్వేకు అంగీకారం కుదిరిందన్నా రు. భద్రాచలం పట్టణం, మణుగూరు హెవీ వాట ర్ ప్లాంట్, కిన్నెరసాని, ముర్రేడు వాగుల పరిసర ప్రాంతాల్లో ముంపు ప్రభావాలను అంచనా వే యాల్సి ఉంది.

పోలవరం ప్రాజెక్ట్‌ను రెండు దశ ల్లో అమలు చేస్తున్నట్లు 2025 ఏప్రిల్ 8న జరిగి న ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేసింది. మొ దటి దశలో 41.15 మీటర్ల వరకు, రెండోదశలో 4 5.72 మీటర్ల వరకు నిల్వ చేపడతామని అ ప్పట్లో తెలిపారని, రెండోదశ పనులు చేపట్టే ముందు రక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని పే ర్కొంది. ఇదే సమయంలో పోలవరం లిఫ్ట్ స్కీ మ్ పనులను ఏపీ ప్రభుత్వం పునః ప్రారంభించేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు మీడియాలో వస్తు న్న వార్తలపై తెలంగాణ సర్కార్ ఆందోళన వ్యక్తం చే సింది. 

అనుమతి లేకుండానే పనులు!

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సీడబ్ల్యూసీ, పీపీ ఏ అనుమతి లేకుండానే లిఫ్ట్ స్కీమ్ పనులు చేపడుతున్నారని తెలంగాణ సర్కార్ ఆరోపించింది. ఇప్పటికే 2021--22లో ఈ పనులను నిలిపివేయాలని కేంద్ర సంస్థలు ఆదేశించాయని గుర్తు చేసింది. పోలవరం ప్రాజెక్ట్ సమగ్ర సాంకేతిక, ఆర్థిక, అంతర్రాష్ట్ర అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించారని, లిఫ్ట్ స్కీమ్ వంటి మా ర్పులు ఇతర అంశాలపై ప్రభావం చూపుతాయని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కూడా అప్పట్లో ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పేర్కొం ది.

  అందువల్ల పోలవరం లిఫ్ట్ స్కీమ్ పనులను వెంటనే నిలిపివేసి, ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను కూడా సమీక్షించాలని పీపీఏను కోరింది. ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రభుత్వాన్నికోరగా, గోదా వ రి నది నిర్వహణ బోర్డు(జీఆర్‌ఎంబీ) కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.