ఎన్‌పీఏ రుణ ఖాతాలను తగ్గించాలి
అదనపు కలెక్టర్ విద్యాచందన
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 14, (విజయక్రాంతి): స్వయం సహాయక సంఘాల ఎన్ పి ఏ రుణ ఖాతాలను తగ్గించాలని, బ్యాంకర్లు స్వయం సహాయ సంఘాల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన ఆదేశించారు.
శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు, బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాలు, రుణ బకాయిలు, ఎన్పీఏ ఖాతాలపై మండలాలు, సంఘాల వారీగా సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ మండలాలు, సంఘాల వారీగా రుణ ఖాతాలను పరిశీలించి, బకాయిల వసూళ్లకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఎన్పీఏను పూర్తిస్థాయిలో తగ్గించేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించేలా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలని, రుణాల చెల్లింపులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైన చోట బ్యాంకర్లు, ఏపీఎంలు కలిసి స ంఘాల సభ్యులకు రుణ చెల్లింపుల ప్రా ముఖ్యతపై అవగాహన కల్పించాలని సూ చిం చారు. ఈ సమావేశంలో ఎల్డీఎం రామిరెడ్డి, పీఎం వీరమల్లు, పీఈ వెంకట్, అదనపు డీఆర్డీఓ నీలేష్, డీపీఎంలు, అన్ని బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.






