18 July, 2026 | 4:22 PM

Breaking News

100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •   సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు   •   చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి   •   రామగుండం కమీషనరేట్ లో కోర్టు డ్యూటీ అధికారుల పనితీరు మెరుగుపర్చాలి   •  

నిజాయితీ చాటుకున్న నిర్మల్ డ్రైవర్

10-02-2026 05:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ లగ్జరి బస్సు హైదరాబాద్ నుండి నిర్మల్ వస్తుంది. నర్సాపూర్ (జి) చెందిన సత్తయ్య విలువైన సెల్ ఫోన్ పోగొట్టుకుని బస్ దిగిపోయాడు. బస్సు డిపోకు చేరుకోగానే బస్ చెక్ చేయగా అందులో సెల్ ఫోన్ లభ్యమయింది. సెల్ ఫోన్ ఆధారంగా సదరు ప్రయాణికున్ని పిలిపించి సెక్యూరిటీ విజలెన్స్ అధికారి విగ్నేష్ రెడ్డి, ఆన్ డ్యూటీ కంట్రోలర్ జి.ఆర్.రెడ్డి సమక్షంలో ఫోన్ అప్పచెప్పడం జరిగింది. నిజాయితీగా సెల్ ఫోన్ అప్పగించిన డ్రైవర్ నందిపేట సుమన్ ను డిపోమేనేజర్ కే పండరి అభినందించారు.