2 July, 2026 | 4:07 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

టీజీఎన్పీడీసీఎల్‌లో 339 కొత్త పోస్టులు

03-07-2025 12:31 AM

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణ నార్త్ డిస్కమ్ టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో కొత్తగా 339 పోస్టులకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో చీఫ్ ఇంజినీర్, చీఫ్ జనరల్ మేనేజర్, జాయింట్ సెక్రటరీ, సూపరిం టెండింగ్ ఇంజినీర్, జనరల్ మేనేజర్ (పీ అండ్ జీ), డివిజనల్ ఇం జినీర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, అకౌంట్స్ ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, సబ్ ఇంజినీర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ లైన్ ఇన్స్ పెక్టర్, అసిస్టెంట్ లైన్‌మెన్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్, స్వీపర్ కమ్ గార్డినర్, స్వీపర్, శానిటరీ ఆర్డర్లీస్ పోస్టులున్నాయి.  ఆర్థిక శాఖ అనుమతి లభించడంతో త్వరలోనే నోటీఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.