04-02-2026 03:16:09 PM
దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ లో బస్సుల సమాచారం కోసం సెల్ 9490510752 నెంబర్ ను సంప్రదించాలని డిపో మేనేజర్ విజయకుమారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కోసం, ఆర్టీసీ బస్సుల సమయ వేళలు, తదితర వివరాలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించాలని సూచించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.