బోథ్ అడవులలో బొబ్బిలి సంచారం... జంకుతున్న జనం
బోథ్. ఆగస్టు 30 (విజయక్రాంతి): అటవీ శాఖ పరిధిలో పులి సంచరిస్తుండడంతో జనం జంకుతున్నారు. గత ఐదు సంవత్సరాల కాలంగా స్థానికడవుల్లో రెండు పులులు సంచరిస్తున్నవి . అయితే గత రెండు నెలల క్రితం ఆడపులి రెండు పిల్లలను కరణంతో ఆడ పులి ఈ ప్రాంతాన్ని విడిచి ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్నదని అటవీశాఖ అధికారులు గుర్తించారు..
వారం రోజుల వ్యవధిలో రెండు పశువుల పై దాడి
స్థానిక అడవులలో మఖం వేసిన పులి వారం రోజుల వ్యవధిలో రెండు పశువుల పై దాడి చేసింది. వజర్, దేవుల నాయక్ తండ గ్రామాల పరిసరాలలో పులి పశువులపై దాడి చేసి చంపివేసింది. అయితే దీంతో అటవీ సమీప గ్రామాల్లో ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రాత్రిపూట పంట కాపులకు వెళ్లాలంటే భయపడుతున్నామని రైతులంటున్నారు. అటవీపై అధికారులు దృష్టి సారించడంతో అడవి దట్టంగా పెరిగిందని దీంతో జంతుజాలం తిరగడం పులికి ఆహారంగా కావలసినంత జంతుజాలం ఉండడంతో ఇక్కడే తిష్ట వేసిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అంతేగాక చిరుతల సంచారం సైతం అధికంగా ఉందని. రాత్రిపూట గ్రామాల సమీపంలో చిరుతలు సంచరించి కుక్కలను ఎత్తుకుపోతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
వజ్జర్ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నదని అయితే మహారాష్ట్ర అడవులను ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో పులికి అనుకూలంగా ఉండడంతో తరచుగా పులి వస్తుందని అటవీ శాఖ వర్గాల వారు అంటున్నారు. పులి సంచరించడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పొలం పనులకు వెళ్లేవారు గుంపులు గుంపులుగా వెళ్లాలని, పశువుల కాపరులు అడవిలోకి వెళ్ళవద్దని పేర్కొంటున్నారు. పులికి హాని తలపెట్టవద్దని ఎవరైనా హాని తలపెట్ట ప్రయత్నిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని అటవీ శాఖ అధికారులు ప్రజలకు వివరిస్తున్నారు. ఏది ఏమైనా పులులకు ఆవాసంగా స్థానిక అడవులు ఉండడంతో ఇక్కడే ఉంటుందని పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.






