ఎమ్మెల్యే సహకారంతో నూతన బస్సు సేవలు ప్రారంభం
ఇల్లంతకుంట, మార్చి 4(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వేల్జిపూర్ గ్రామంలో సిరిసిల్ల నుండి వేల్జిపూర్ మీదుగా ఇల్లంతకుంట వర కు నూతన బస్సు సేవలను మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో గ్రామ సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ మాట్లాడుతూ. గ్రామ ప్రజల సౌకర్యార్థం ప్రారంభించిన ఈ బస్సు సేవల ను అందరూ వినియోగించుకొని ఆక్యుపెన్సీ పెంచాలని కోరారు.
గ్రామానికి బస్సు సౌక ర్యం కల్పించడంలో సహకరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండ వెంకటేశం, గ్రామ శాఖ అధ్యక్షుడు గొల్లకోమటి శంకర్ యాద వ్, సీనియర్ నాయకులు మూల బాల్ రెడ్డి, బొల్లారం పరశురాములు, వార్డ్ సభ్యులు బోజ్జ శ్రీనివాస్, దేశెట్టి కవిత, సంగేపు ము త్తవ్వ, వేములవాడ భారతి, బొల్లారం ప్రసన్నకుమార్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయ కులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




