420 అడుగుల ఫ్లెక్సీతో వినూత్న నిరసన
02-09-2026 | 06:39pm
మహబూబాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అలవికాని హామీలను ఇచ్చి, అమలు చేయలేక ఇప్పుడు చతికిలబడి, ప్రజలను మోసం చేసిందని, వెయ్యి రోజుల పరిపాలన పూర్తిగా 420గా మారిందని ఆరోపిస్తూ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) ఆధ్వర్యంలో మహబూబాబాద్(Mahabubabad) జిల్లా తొర్రూరు పట్టణంలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీ(Flex banner) తో బిఆర్ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొని 425 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ పట్టణ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు.






