28 February, 2026 | 7:46 PM

యునైటెడ్ స్కూల్‌లో జాతీయ సైన్స్‌ దినోత్సవం

28-02-2026 05:47 PM

మునిప‌ల్లి,(విజయక్రాంతి): జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకొని శ‌నివారం మండ‌లంలోని తాటిప‌ల్లి యూనైటెడ్ స్కూల్ లో ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా  విద్యార్థులు పలు విధాల సైన్స్‌ ప్రయోగాలను ప్రదర్శించారు. ప్రతిభచూపిన విద్యార్థులకు  స్కూల్ క‌ర‌స్పాండెంట్ తాటిప‌ల్లి మ‌ల్లేశం బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్కూల్ అధ్యాపక బృందం, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.