10 March, 2026 | 2:03 PM

‘కాకతీయ’ సంపదకు జాతీయ గుర్తింపు

10-03-2026 01:42 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): తెలంగాణ వారసత్వానికి జాతీయ గుర్తింపు లభించడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. పీఎం మోదీ దార్శనిక నాయకత్వంలో కాకతీయ వైభవానికి మరో అరుదైన గుర్తింపు లభించిందని తెలిపారు. ములుగు జిల్లా పాలంపేటలోని శివాలయం, గొల్లాల గుళ్లను భారత పురావస్తు శాఖ జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా ప్రకటిం చిందని తెలిపారు.

ఈ కట్టడాలతో కలిపి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం రక్షణలో ఉన్న స్మారక కట్టడాల సంఖ్య 10కి చేరిందని తెలిపారు. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఉన్నదని, ఈ కట్టడాలు జాతీయ హోదా, పురాతన సంపదను భావి తరాలకు అందిస్తాయన్నారు.