23 June, 2026 | 2:45 AM

మత్తు లేని సమాజాన్ని నిర్మించుకుందాం

23-06-2026 01:29 AM

నిర్మల్ జూన్ 22 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మత్తు లేని సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిషా ముక్తి భారత్ పోస్టర్లను ఆవిష్కరించారు. నేటి యువత చెడు అలవాట్లకు లోను కాకుండా ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. 

ఈనెల 24న జిల్లా స్థాయి సమీక్ష 

నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించబడుతున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ప్రత్యేక అధికారి సీనియర్ ఐఏఎస్ ఇల్లంబర్ది ఆధ్వర్యంలో ఈ నెల 24న సమీక్ష ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో పాయ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి నివేదికను ప్రతి ఒక్క అధికారి ఈ సమావేశంలో చర్చించాలన్నారు. ఇప్పటివరకు ఆయా శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై వీడియో ఫోటోగ్రఫీ ప్రదర్శనలు కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ వెంకటేశ్వర్లు డిఆర్‌ఓ రమేష్ రాథోడ్ డిపిఆర్‌ఓ విష్ణువర్ధన్ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి వినూత్న అధికారులు పాల్గొన్నారు.