29 March, 2026 | 2:42 PM

మేయర్ బాధ్యత ఇచ్చిండ్రు.. అన్యాయం ఎక్కడ?

29-03-2026 12:57 PM

కుర్చీ కోసం ప్రజా సమస్యలు మర్చిపోతే ఎలా?

వీడదేసే పనులకు శ్రీకారం చుట్టొద్దు 

ప్రజలు అభివృద్ధి మాకు ముఖ్యం 

నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు..

ప్రజలకే నష్టం విలేకరుల సమావేశంలో నగర్ మేయర్ గుమల్ మమతశ్రీనివాస్ 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): బీసీ మహిళకు మహబూబ్ నగర్ మొదటి కార్పొరేషన్ మేయర్ గా సముచిత గౌరవం ఇవ్వడం జరిగిందని అన్యాయం ఎక్కడ జరిగిందో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని నగర మేయర్ గుమల్ మమత శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ సమావేశ భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మేయర్ గా బాధ్యతలు చేపట్టిన మొదటి సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం బీసీ మహిళకు దక్కిందని, బీసీ మహిళకు సముచిత స్థానం ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు సభను వాకౌట్ చేసి కుర్చీ కోసం అంటూ చెప్పి బయటకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు.

నాయకులు నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారని ప్రజలే నష్టపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఎంతో నమ్మకం ఉంచి గెలిపించిన కార్పొరేటర్లందరూ వారి డివిజన్లో బాధ్యతగా పనిచేసే అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ విషయాన్ని మరిచి వాకౌట్ చేసి వెళ్లిపోతే ప్రజా సమస్యలు తీరుతాయా ప్రశ్నించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుట్రలో భాగమే బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారని విమర్శించారు. గతంలో తాము కూడా టిఆర్ఎస్ లో పనిచేశామని వేసిన నామినేషన్ను కూడా విత్ డ్రా చేసుకోవాల్సిన దుస్థితి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాయంలో మాకు జరిగిందని విమర్శించారు.

మా జోలికి రాకూడదని అందరికీ మంచి చేయాలని తపనతో మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. కుర్చీ లో ఎవరు కూర్చుంటే ఏముంటుందని మనందరం ఒకటే అనే భావనతో కార్పొరేటర్లతో కలిసిమెలిసి ఉంటున్నామని రాజకీయ అనుభవం తమకు తక్కువగా ఉందని, ప్రతి విషయంలోనూ తెలుసుకొని ప్ సముచిత స్థానం సంపాదిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం పనిచేస్తానన్నారు.

సభ పూర్తిస్థాయిలో జరిగేలా చూసుకుని తర్వాత ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరించేందుకు అవకాశం ఉందని ఇలా వాకౌట్ చేసి వెళ్లి పోతే ఎవరికి ఉపయోగమని ప్రశ్నించారు. మరో మరో ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో ప్రతి కార్పొరేటర్ ప్రజా సమస్యలను తెలియజేసి నగరాన్ని మరింత అభివృద్ధి శాఖ ముందుకు తీసుకుపోయేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు గుమల్ శ్రీనివాస్,నర్సింలు, రామస్వామి, అనుప ఆంజనేయులు,  మురళి తదితరులు ఉన్నారు.