29 March, 2026 | 1:19 PM

రోడ్డు పనులను ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ధర్నా

29-03-2026 11:28 AM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ - సిర్గాపూర్, మసన్ పల్లి రోడ్డు పనులు నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి శనివారం సిర్గాపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ కార్యకర్తలతో ధర్నాకు దిగారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో 15 కోట్లతో మంజూరు అయ్యిన రోడ్ల నిర్మాణం పనులు ఎక్కడికక్కడే మధ్యలోనే ఆగి పోయాయాని మండి పడ్డారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో మంజూరు చేయించిన రోడ్డును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పాలకులు దీనిని నిర్మించకపోగా పనులు మధ్యలోనే నిలిపివేయడంతో ప్రారంభమై కొన్ని చోట్ల రోడ్డు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయినా ఈ రోడ్డు పనులపై నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవ్ రావ్ పాటిల్, మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మాధవ్ రావ్, కడ్పల్ ఉపసర్పంచ్ జి.రమేష్, కడ్పల్ గ్రామ బిఆర్ఎస్ నాయకులు కిష్టరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజా మల్లయ్య, ప్రసాద్ రాజ్, నాగభూషణం, అబ్దుల్ రహీమ్, సంగమేష్, సిర్గాపూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు యాదవ్ రావ్, యువ నాయకులు నర్సగౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు యువ నాయకులు తదితరులు ఉన్నారు.