29 March, 2026 | 3:55 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

29-03-2026 02:20 PM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ(Telangana Legislative Assembly) నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. సభ నుంచి ఇవాళ, రేపు రెండు రోజుల పాటు  బీఆర్ఎస్ సభ్యులను సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, పద్మారావు, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, సబితా ఇంద్రారెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, కేపీ వివేకానంద్, అనిల్ జాదవ్, కోవ లక్ష్మిలు సస్పెన్షన్ గురైన వారిలో ఉన్నారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తనకు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రతిపాదించారు.  దీంతో పాటుగా కడియం శ్రీహరి విషయంలో కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేస్తూ సభ నిర్ణయం తీసుకుంది.