ఖమ్మం వైరా రోడ్డులో దారుణం.. కత్తులతో పరస్పర దాడి
ఇద్దరికి తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు
ఖమ్మం, ఏప్రిల్ 24(విజయక్రాంతి): వివాహేతర సంబంధం అనుమానంతో ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసుకున్న దారుణమైన సంఘటన శుక్రవారం ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో జరిగింది. వివాహేతర సంబంధం అనుమానంతో కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలైయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా తక్షణమే స్పందించిన పోలీసులు 108 వాహనంలో ఇద్దర్ని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కామేపల్లి మండలం, సాతానిగూడెం గ్రామానికి చెందిన భూక్యా ఆనంద్ ఖమ్మం బొమ్మన సెంటర్‌లో సెల్ షాపు పనిచేస్తున్నాడు.
ఆ షాపులో రియాజ్ అనే వ్యక్తి సెల్ మెకానిక్‌గా వర్క్ చేస్తున్నాడు. రియాజ్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆనంద్ కు అనుమానం వచ్చింది. చాలా రోజులుగా మానసికంగా ఇబ్బందిపడుతున్న ఆనంద్ గురువారం రాత్రి సుమారు 10:45 కు నిజాంపేట ఏరియాలోని రియాజ్ ఇంటికి వెళ్లిన ఆనంద్,అక్కడ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ఘర్షణకు దారితీసింది. ఆనంద్ తన వద్ద ఉన్న కత్తితో రియాజ్ పై దాడి చేయగా, రియాజ్ తన ఇంట్లో ఉన్న చాకుతో వచ్చి ఆనంద్ పై ఎదురుదాడికి దిగాడు. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకుంటూ నిజాంపేట నుంచి రోడ్డులోని బిలీఫ్ హాస్పిటల్
మీదుగా ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడ రోడ్డుపై పడిపోవడంతో రియాజ్, ఆనంద్ లను స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని రియాజ్, ఆనంద్ ను ప్రభుత్వాసుపత్రి తరలించారు. రియాజ్ పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం ఖమ్మం లోని ప్రవేట్ హాస్పిటల్లో తరలించారు. ఆనంద్ కు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






