30 March, 2026 | 6:22 PM

ఆస్తి పన్ను వసూళ్లకు చెత్త ట్రాక్టర్లతో చుట్టుముట్టిన మున్సిపల్ సిబ్బంది

30-03-2026 04:42 PM

తాండూరు అధికారుల వినూత్న తీరు

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను మొండి బకాయిల వసుళ్ళ కోసం అధికారులు వినూత్నంగా చెత్త ట్రాక్టర్లతో మున్సిపల్ వాహనాలతో పెట్రోల్ పంపును చుట్టుముట్టారు. పట్టణంలోని విలియం హై స్కూల్ వద్ద ఉన్న ఇలాహి ఫీలింగ్ స్టేషన్ (పెట్రోల్ బంక్) యజమాని ఐదు సంవత్సరాల నుండి దాదాపు రూ.82 వేలు చెల్లించాల్సి ఉంది. ఆస్తి పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపించిన స్పందించకపోవడంతో సోమవారం మున్సిపల్ కమిషనర్, సిబ్బంది చెత్త ట్రాక్టర్లతో గంటసేపు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రేపు మంగళవారం సాయంత్రం లోగా ఆస్తి పన్ను చెల్లించాలని లేదంటే ఆస్తులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.