30 March, 2026 | 6:47 PM

మీల్స్ ఆన్ వీల్స్ 1వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ

30-03-2026 05:11 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధాన సేవా కార్యక్రమం మీల్స్ ఆన్ వీల్స్ అన్న ప్రణాళిక విస్తరణయొక్క 1వ వార్షికోత్సవం 30 మార్చి 2026, సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు, తెలంగాణ స్థూప సర్కిల్ వద్ద మార్కెట్ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన ఘనంగా నిర్వహించబడింది. గత 365 రోజులుగా నిరంతర సేవ అందిస్తూ.. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు వందలాది పేద మరియు నిరుపేదలకు పోషకాహారం అందించబడుతూ సమాజ సేవలో లయన్స్ క్లబ్ తన కట్టుబాటును మరొక్కసారి చాటింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ 58వ డివిజన్ కార్పొరేటర్ లయన్ వంగాల పావన్ కుమార్ 66వ డివిజన్ కార్పొరేటర్ ఈ కార్యక్రమం లయన్ చిడూర సురేష్ పి ఎం జె ఎఫ్  ప్రాజెక్ట్ చీఫ్ అడ్వైజర్ సమక్షంలో నిర్వహించబడింది. 

ఈ సందర్భంగా ఒక గర్వకారణ ఘట్టంగా, కరీంనగర్ మేయర్  కొలగాని శ్రీనివాస్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సభ్యుడిగా అధికారికంగా చేరారు ఆయన చేరికతో క్లబ్ సేవా కార్యక్రమాలకు మరింత శక్తి, ప్రేరణ లభించనుంది. ముఖ్య అతిథులు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చేస్తున్న సేవలను అభినందిస్తూ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని సమాజానికి ఆదర్శప్రాయమైన సేవగా కొనియాడారు.