30 March, 2026 | 6:54 PM

ఆపదలో ఉన్న పేద కుటుంబానికి ఆర్థిక సహాయం

30-03-2026 04:59 PM

తాండూరు,(విజయక్రాంతి): అనారోగ్యంతో కుటుంబ పెద్ద మృతి చెందడంతో పెద్దదిక్కు కోల్పోయి ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రముఖ వైద్యులు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ ఆర్థిక సహాయం అందించి ఆసరాగా నిలిచారు. సోమవారం తాండూర్ మండలం కరణ్ కోట్  గ్రామానికి చెందిన  బక్క మాణిక్యప్పా రామప్ప అనే వ్యక్తి మృతి చెందిన విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ  సానుభూతి తెలుపుతూ  అంతక్రియలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఆపదలో తమ కుటుంబానికి ఆసరాగా నిలిచిన డాక్టర్ సంపత్ కుమార్ కి మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.