14 March, 2026 | 11:42 PM

మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం

14-03-2026 07:56 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆర్థిక సంవత్సరం (2026-2027)కి రూ.52.5కోట్ల అంచనాతో మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఆదాయ వనరులు పెంచుకొని, వ్యయాన్ని తగ్గించి మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని తెలిపారు. అనంతరం బడ్జెట్ పద్దులపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ షాహిన్ సుల్తానా, ఎమ్మెల్సీ దండే విఠల్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి,కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.