8 March, 2026 | 2:50 AM

మృత్యుంజయ్ అరుదైన థ్రిల్లర్

08-03-2026 01:02 AM

శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మార్చి 6న విడుదలై, థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ శనివారం సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ..“ఈ మూవీని ప్రేక్షకులు చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు. సినిమా చూసిన వాళ్లంతా గొప్పగా ఉందని ప్రశంసిస్తున్నారు.

తెలుగులో చాలా అరుదుగా వచ్చే థ్రిల్లర్లలో ఇదొక మంచి సినిమా అవుతుంది” అన్నారు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ.. “మృత్యుంజయ్’ని ప్రమోట్ చేసేందుకు పాటలు, కామెడీ సీన్లు కూడా లేవు. మేం రిలీజ్ సినిమాలోని కంటెంట్‌తోనే ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు” అని చెప్పారు. ‘డే వన్ నుంచి మా మూవీకి మంచి రెస్పాన్స్ లభించింది. నా సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లంతా హ్యాపీగా ఉన్నారు. నాకు అదే చాలా పెద్ద సక్సెస్’ అని సందీప్ గుణ్ణం తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ మాట్లాడుతూ.. “మృత్యుంజయ్’ స్కోర్‌కు చాలా మంచి పేరు వస్తోంది. ఇదంతా టీమ్ ఎఫర్ట్‌” అని చెప్పారు.