31 March, 2026 | 2:08 PM

Breaking News

వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •  

వంతెన, భూగర్భ రోడ్డు నిర్మాణాల స్థలాలను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

01-12-2025 12:03 AM

ఘట్ కేసర్, నవంబర్ 30 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో మైసమ్మ గుట్ట వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి రోడ్డులో వంతెన, భూగర్భ రోడ్డు నిర్మాణ పనులను మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదివారం పరిశీలించడం జరిగింది.హైదరాబాద్-వరంగల్ హైవే ఏర్పడిన తర్వాత ఘట్ కేసర్, అన్నోజిగూడలోని ఎన్ టి పి సి చౌరస్తా ప్రాంతాలలో రోడ్డు  యాక్సిడెంట్స్ వల్ల చాలామంది చనిపోయారు.

మైసమ్మ గుట్ట కాలనీకి, హాస్టల్స్ కు, విద్యార్థులకు రోడ్డు క్రాస్ చేయడం ఇబ్బంది అవుతుందని ప్రజల కోరిక మేరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాభిప్రాయం మేరకు ఈ ప్రాంతంలో అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించడానికి అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది.ఒక సంవత్సర కాలంలో పాత అండర్ పాస్ తో పాటుగా మైసమ్మ గుట్ట దగ్గర అండర్ పాస్ కూడా పూర్తిచేసి ప్రజలకు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు.

ఈసందర్భంగా ప్రజలు ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఘట్ కేసర్ రైతు సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్లు బండారి ఆంజనేయులు గౌడ్, బేతాళ నర్సింగ్ రావు, రైతు సొసైటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు, బిఆర్‌ఎస్, బిజెపి టిడిపి, సిపిఎం, సిపిఐ  పార్టీ నాయకులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.