6 June, 2026 | 6:49 PM

Breaking News

వైద్యులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలి   •   గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి   •   లింగారెడ్డిగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందాం   •   ఫార్మర్ రిజిస్టీ తప్పని సరి   •   వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •  

చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు

06-06-2026 05:25 PM

 శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

చర్ల,(విజయక్రాంతి): మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం చర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు అంబరాన్నంటాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు గా టీపిసీసీ జనరల్ సెక్రెటరీ నల్లపు దుర్గాప్రసాద్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి కృష్ణ పాల్గొన్నారు.

నాయకులు ఎంపీ చిత్రపటం వద్ద కేక్ కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నల్లపు దుర్గాప్రసాద్, డీసీసీ ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీ బలరాం నాయక్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.