calender_icon.png 16 February, 2026 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా మూడ్ గణేష్

16-02-2026 12:12:00 PM

భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్(Kothagudem Municipal Corporation) తొలి మేయర్గా సిపిఐ అభ్యర్థి  మూడ్ గణేష్ నియమితులయ్యారు. సుజాతనగర్ పరిధిలోని 20వ డివిజన్లో సిపిఐ అభ్యర్థిగా గెలుపొందిన అతనికి మేయర్ పదవి దక్కింది. 

డిప్యూటీ మేరుగా సిరిపురం లలిత కుమారి..

పాల్వంచ పట్టణ పరిధిలోని 8వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన సిరిపురం లలిత కుమారి డిప్యూటీ మేరుగా ఎంపికయ్యారు. కాంగ్రెస్, సిపిఐ పార్టీల అంగీకారం మేరకు చెరి రెండున్నర సంవత్సరాలు మేయర్ పదమే నీ పంచుకున్నారు అందులో భాగంగా మొదటి రెండు నర సంవత్సరాలు సిపిఐ అభ్యర్థిగా గణేష్ ఎంపికయ్యారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.