25 July, 2026 | 9:38 PM

మోబవెన్యూ ఏఐ న్యూరల్ ఇంజిన్‌ విడుదల

25-07-2026 08:52 PM

ముంబై, జూలై 23, 2026 ః

ప్రకటనలు, మార్కెటింగ్, వినియోగదారుల వృద్ధి రంగాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ఏఐ-నేటివ్ టెక్నాలజీ కంపెనీ అయిన మోబవెన్యూ ఏఐ టెక్ లిమిటెడ్ తమ కొత్త బ్రాండ్ గుర్తింపును విడుదల చేసింది. దీనితో పాటుగా తమ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లలో నిర్మించిన ఏఐ ఇంటెలిజెన్స్ లేయర్ అయిన మోబవెన్యూ న్యూరల్ ఇంజిన్‌ను సైతం ప్రారంభించినట్లు వెల్లడించింది. 

ఈ సందర్భంగా మోబవెన్యూ ఏఐ టెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎండీ - సీఈఓ, ఇషాంక్ జోషి మాట్లాడుతూ ప్రకటనల రంగంలో ప్రతి ప్రధాన మార్పు సాంకేతికత ద్వారానే నడపబడింది. సెర్చ్ డిస్కవరీని మార్చింది, సోషల్ డిస్ట్రిబ్యూషన్‌ను మార్చింది, ప్రోగ్రామాటిక్ నిర్ణయాలను మార్చింది. ఇప్పుడు ప్రకటనలను ఉద్దేశం, తెలివితేటలు , ప్రభావం వైపు మార్చడం ద్వారా ఈ దిశను ఏఐ మారుస్తోందన్నారు. తాము మా లోగోను మార్చడానికి చాలా కాలం ముందే ఆ మార్పు కోసం సిద్ధమవుతున్నామని గ్రహించామని చెబుతూ ఈ కొత్త గుర్తింపు కంపెనీ మారుతున్న తీరుకు అనుగుణంగా ఉందని చెప్పారు.  న్యూరల్ ఇంజిన్ తాము ఏ దిశగా పయనిస్తున్నామో స్పష్టంగా తెలియజేస్తుందని వెల్లడించారు.  

మోబవెన్యూ ఏఐ టెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు , సీటీఓ తేజస్ రాథోడ్ మాట్లాడుతూ వర్క్‌ఫ్లోల వైవిధ్యత వల్ల మార్కెటింగ్ బృందాలు అసాధారణ రీతిలో  సమయాన్ని కోల్పోతున్నాయి. ఒక టూల్‌లో ప్లాన్ చేయడం, మరొక టూల్‌లో లాంచ్ చేయడం, క్రియేటివ్‌కు విడిగా బ్రీఫ్ చేయడం, ఆపై ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి డాష్‌బోర్డ్‌లను శోధించడం వంటివి చేయాల్సి ఉంటుంది. మార్కెటింగ్‌లో ఏఐ పరిపక్వతపై పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న చాలా పరిశోధనలు ఇదే అంతరాన్ని సూచిస్తున్నాయి. ఆ అంతరాన్ని పూడ్చడానికి తాము న్యూరల్ ఇంజిన్‌ను రూపొందించామని తెలిపారు.

దీని ద్వారా కస్టమర్లు ప్రకటనల యంత్రాంగాన్ని నిర్వహించడానికి తక్కువ సమయం వెచ్చించటం తో పాటుగా వ్యూహం, సృజనాత్మకతపై ఎక్కువ వెచ్చించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మోబవెన్యూ ఏఐ టెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ , సీఓఓ కునాల్ కోఠారి మాట్లాడుతూ తాము నిర్వహించే ప్రతి కార్యకలాపంలో ఏఐని పొందుపరచడమే ఈ విస్తరణకు కారణన్నారు. ఈ ఆవిష్కరణ తమ లక్ష్యానికి ఒక నిదర్శనమని చెబుతూ తాము కేవలం ఒక గ్లోబల్ అడ్వర్టైజింగ్ ఎకోసిస్టమ్‌లో పాల్గొనడం లేదు, దానికోసమే నిర్మిస్తున్నామన్నారు.