24 July, 2026 | 3:29 PM

బిజెపి నేత మల్లారెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ

24-07-2026 02:24 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): బిజెపి నేత మల్లారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకొన్న ఎమ్మెల్సీ అంజి రెడ్డి మంచిర్యాల పట్టణంలోని మల్లారెడ్డి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు. అంతక్రియల్లో పాల్గొనీ పాడే మోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మల్లారెడ్డి 2013లో భారతీయ జనతా పార్టీలో చేరి, 2014లో బిజెపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. BJpకి ఎనలేని సేవలు అందించారని, వారు లేక పోవడం భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద వ్యక్తిని కోల్పోయినట్లు అయ్యిందన్నారు. భారతీయ జనతా పార్టీ ముల్కల మల్లారెడ్డి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, కందుల సంధ్యా రాణి, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.