26 March, 2026 | 3:29 PM

Breaking News

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలి   •  

ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది సున్నా

26-03-2026 01:55 PM

సత్తుపల్లిలో వైద్య సిబ్బంది సమస్యను ప్రస్తావించిన ఎమ్మెల్యే 

సత్తుపల్లి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఉన్న చాలినంత సిబ్బంది లేకపోవడం వల్ల మెరుగైన వైద్యం అందటం లేదని శాసనసభలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రస్తావించారు. గురువారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ 2026 బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో మూడు వైద్య విధాన పరిషత్ సి హెచ్ సి లున్న, చాలినంత వైద్యులు వైద్య సిబ్బంది కొరత ఉందన్నారు.

వాటిల్లో 100 పడకాల ఆస్పత్రి, 50 పడకల ఆసుపత్రి 30 పడకల ఆస్పత్రులు నూతనంగా నిర్మాణం జరిగి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ వైద్య సేవలు అందించే వైద్యులు సిబ్బంది లేని కారణంగా వారిని ప్రారంభించడానికి వెనుకాడాల్సిన పరిస్థితి ఉందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఉన్న వైద్యులు డిప్యూటేషన్ పై ఖమ్మం పరిసర ప్రాంతాల్లోకి వెళ్లిపోతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో పనిచేసే వైద్యులకు ఇన్సెంటివ్ పెంచి స్థానికంగా ఉండే అవకాశం కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కి ఆమె విజ్ఞప్తి చేశారు.