అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య
11-08-2026 02:39 PM
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు పట్టణంలోని శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీపన్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన వెంట ఇల్లందు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్ నాయక్, గురుస్వామి గణేశన్ సదానందం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






