11 August, 2026 | 3:35 PM

Breaking News

కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు పూజలు

11-08-2026 02:11 PM

గణపురం,(విజయక్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బహుళ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామదేవతలకు పంచామృత అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతినెల నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.