26 June, 2026 | 5:51 PM

28న కోదండరామ్ నిర్మల్ రాక

26-06-2026 04:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర జన సమితి అధ్యక్షులు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తేదీ 28 ఆదివారం నిర్మల్ కు వస్తున్నట్లు జిల్లా జేసి నాయకులు పారే విజయకుమార్ ఎంసీ లింగన్న తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు నిర్మల్ లోని పెన్షనర్ల సంఘ భవన్ లో జరిగే తెలంగాణ జన సమితి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ నాయకులతో కలిసి ఉద్యమ కారుల గుర్తింపు కోసం బయోడేటా సేకరించడం జరుగుతుందన్నారు.

2014 వరకు TJACతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు వారి వారి బయోడేటా రెండు కాపీలు తీసుకుని రాగలరు. వాటిని క్రోడీకరించి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఉద్యమకారుల లిస్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయగలరు.