ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే
బోత్,(విజయక్రాంతి): అగ్నిప్రమాదంలో మక్క పంటను కోల్పోయిన బోత్ మండలంలోని నిగిని గ్రామానికి చెందిన జాదవ్ శో వాన్ సింగులను సోమవారం బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పరామర్శించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు ధైర్యపడవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వపరంగా పరిహారం అందే విధంగా కృషి చేస్తామన్నారు.
విద్యుత్ రెవెన్యూ అధికారులతో మాట్లాడి తగు నివేదిక అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తూల శ్రీనివాస్ నారాయణరెడ్డి శ్రీధర్ రెడ్డి రవి రవీందర్ అంబాజీ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ మల్లేష్ ప్రశాంత్ రమణ గౌడ్ ప్రవీణ్ సాగర్ రెడ్డి గంగమల్లు తదితరులు ఉన్నారు. అనంతరం నిగిని గ్రామంలో జగదాంబ దేవి సంత సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద ఐదు లక్షలతో నిర్మిస్తున్న పరిశీలించారు.




