26 June, 2026 | 1:22 PM

చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి

26-06-2026 12:07 PM

జన్నారం, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఐదేండ్ల లోపు చిన్నారులందరికీ ఈ నెల 28వ తేదీన పోలియో చుక్కలు వేయించాలని పీ హెచ్ సీ డాక్టర్ ఉమాశ్రీ శుక్ర వారం కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ మండలంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలనీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, బస్టాండ్లు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి చిన్నారులకు చుక్కలు వేస్తారని వివరించారు. పోలియో రహిత మండలంగా తీర్చి దిద్దేందుకు ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించి, తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలనీ కోరారు.