6 June, 2026 | 9:18 PM

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

06-06-2026 08:18 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): మిర్యాలగూడ పట్టణంలోని కలాల్ వాడలో ప్రమాదవశాత్తు ఒకే కుటుంబంలో ముగ్గురు సజీవ దహనమై సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని శనివారం  మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) పరామర్శించి మృతదేహాలపై పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఘటన ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాద ఘటన బాధితుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాదిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేలా అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మృతుల దహన సంస్కారాల నిమిత్తం తక్షణ సహాయంగా ₹20,000/-ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.