28 May, 2026 | 2:45 PM

Breaking News

బాల్క సుమన్ వ్యాఖ్యలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి వివేక్

28-05-2026 01:53 PM

చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek venkataswamy) పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Former MLA Balka Suman) పై మంత్రి వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని సుమన్ అంటున్నారు. ప్రభుత్వం ఆస్తులు ధ్వంసంచేస్తే సహించమని హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అనుమతితోనే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారా? సుమన్ వ్యాఖ్యలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని వివేక్ డిమాండ్  చేశారు.