11 May, 2026 | 9:53 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వానం

11-05-2026 08:53 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలం ఖీర్డి గ్రామంలో ఈనెల 18న నిర్వహించనున్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మాలి సంక్షేమ సంఘం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు సెండే వాసు ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ప్రచారకర పత్రాలను మంత్రికి అందజేసి మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సెండే వాసును శాలువాతో సన్మానించి అభినందించారు.సామాజిక చైతన్యానికి మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అవగాహన పెంపొందించేందుకు దోహదపడతాయని మంత్రి పేర్కొన్నట్లు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌, మే 11: ఈనెల 18న నిర్వహించనున్న మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మాలి సంక్షేమ సంఘం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు సెండే వాసు ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ప్రచారకర పత్రాలను మంత్రికి అందజేసి మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సెండే వాసును శాలువాతో సన్మానించి అభినందించారు. సామాజిక చైతన్యానికి మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అవగాహన పెంపొందించేందుకు దోహదపడతాయని మంత్రి పేర్కొన్నట్లు  కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు సెండే వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెండే వాసు తో పాటు మాలి సంక్షేమ సంఘం నాయకులు ఓమ్మాజీ, హనుమంతు, సంఘం సభ్యులు తదితరులు  ఉన్నారు.