మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి
- ప్రభుత్వం స్పందించకపోతే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం
- అవసరమైతే ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- గన్‌పార్క్ వద్ద ప్లకార్డులతో బీఆర్‌ఎస్ నిరసన
హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాం తి) : రాష్ట్రంలో అక్రమ మైనింగ్, అవినీతి వ్యవహారాలకు పాల్పడుతున్న మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చే యాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్‌చేశారు. శాసన సభాపక్ష ఉపనే త హరీశ్‌రావు బయటపెట్టిన వివరాలతో ప్ర భుత్వం కలవరపడిందని పేర్కొన్నారు. ప్రభు త్వం స్పందించకపోతే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే ఈ అంశాన్ని ప్రజల్లోకి వస్తృతంగా తీసుకెళ్తామని స్పష్టం చేశా రు. ఆదివారం గన్‌పార్క్ వద్ద మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ నిరసన తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంలో నంబర్ ఉన్న ఒక మంత్రి చేస్తున్న కుంభకోణాన్ని ఆధారాలతో సహా హరీశ్‌రావు బయటపెట్టారని, ఆ మంత్రి కుటుంబానికి చెందిన కంపె నీ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మైనింగ్‌కు పాల్పడిందని తెలిపారు. ఈ వివరాలు కూడా ప్రభుత్వమే ఇచ్చిన డాక్యుమెంట్ల ఆ ధారంగా బయటకు వచ్చాయని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన ఇతర సంస్థలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై చర్య లు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
మంత్రి కంపెనీ కావడం వల్లనా? లేక ముఖ్యమంత్రి పాత్ర ఉండటం వల్లనా? అని అనుమానం వ్యక్తంచేశారు. ఈ విషయంపై హరీశ్‌రావు ఆధారాలతో సహా వాస్తవాలు బయటపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి స్పంది స్తూ రెండు విషయాలు ఒప్పుకున్నారని తెలిపారు. అక్రమాలు జరిగినట్టు అంగీకరించిన ప్పటికీ, వాటిని బయటపెట్టింది ప్రభుత్వం అన్న పేరుతో ఎదురు దాడి చేయడం విచిత్రమన్నారు.
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దూరపు బంధువులదని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. మంత్రి భార్య, కొడుకు, తమ్ముడికి ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని, 20 20 వరకు ఆయనే చైర్మన్‌గా ఉన్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి మాటల్లో విరుద్ధతలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ మాత్రమే సముద్రతీరం లేని రాష్ట్రం అన్న వ్యాఖ్యలతో ఆయన అవగాహన స్థాయి బ యటపడిందని ఎద్దేవా చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ముఖ్యమంత్రికి ఉన్న అనుకూలత వెనుక కారణాలను విశ్లేషించినప్పుడు, ము ఖ్యమంత్రి పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు స్పష్టమవు తున్నదని ఆరోపించారు.
కేసులు, కమిషన్లతో కాలక్షేపం
కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను ఆ కంపెనీకి అప్పగించడం, రాష్ట్రంలో భూ దందాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఆయన అనుచరుల పాత్రపై కేటీఆర్ అనుమానాలు వ్యక్తంచేశారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ప నులు చేయకుండా కేసులు, కమిషన్లతో కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. తప్పు చేయకపోతే భయం ఎందుకు అని ప్రశ్నిస్తూ, మంత్రి కుటుంబ సంస్థపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. చట్టప్రకారం రెండో నోటీసు ఇస్తే ఏడాది జైలు శిక్ష పడాల్సి ఉంటుందని గుర్తుచేశారు.
మైనింగ్ శాఖ మంత్రి అక్రమాన్ని కేవలం రూ.4 లక్షల వ్యవహారంగా చూపడం సిగ్గుచేటని మండిపడ్డారు. అధికారుల దాడిలో ఒకే రోజులో రూ.32 లక్షల విలువైన అక్రమాలు బయటపడిన నేపథ్యంలో, రెండున్నరేళ్లలో జరిగిన అవినీతి పరిమాణాన్ని అంచనా వేయవచ్చని పేర్కొన్నారు. కోకాపేటలో భాగ్యలక్ష్మి మైనింగ్ కంపెనీ కూడా ముఖ్యమంత్రి బం ధువులకు చెందినదని ఆరోపించారు.
ప్రభు త్వం మైనింగ్ రెవెన్యూ పెరిగిందని చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవంగా రావాల్సిన రూ.1,700 కోట్లలో కేవలం రూ. 900 కోట్లు మాత్రమే వస్తున్నాయని, మిగిలిన నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సభాసంఘం ఏర్పాటు చేసి మంత్రి, ముఖ్యమంత్రి, ఇతరుల పాత్రలను బయటపెట్టాలని డిమాండ్‌చేశారు. గతంలో ఓబులాపురం మైనింగ్ కేసులో హౌస్ కమి టీ ఏర్పాటు చేసినట్టు, ఇదే విధంగా పారదర్శక విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.
ఈ స్కాంలో బీజేపీ సభ్యు ల ప్రవర్తన కూడా గమనించాల్సిన అంశమని, వారు ప్రతిపక్షంగా వ్యవహరించకుం డా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా స్పందన లేదన్నారు. అక్రమ మైనింగ్‌లో పాల్గొన్న మం త్రి, ఆయన కుటుంబ సభ్యులు భూదందా లు, కబ్జాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, వీరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
ఎల్‌అండ్‌టీపై ఒత్తిడి తెచ్చి ఆస్తుల స్వాధీనానికి
హైదరాబాద్ మెట్రో అంశంలో రూ.22 వేల కోట్ల ఆస్తిని రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేశామని సీఎం చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. మెట్రో కోసం ఇచ్చిన 280 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, అది కేవలం లీజుకు మాత్రమే ఇచ్చిందని వివరిం చారు. ఆ భూమిపై ఎల్‌అండ్‌టీ నిర్మాణాలు చేసి, ఆ తర్వాత ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉం టుందని ఒప్పందం ఉందన్నారు.
ప్రైవేట్ సంస్థ అప్పును రాష్ట్ర ప్రజలపై మోపడం సిగ్గుచేటని విమర్శించారు. ఎల్‌అండ్‌టీపై ఒత్తిడి తెచ్చి ఆస్తులను స్వాధీనం చేసుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మెట్రో విస్తరణకు కేంద్రం అభ్యంతరం చెప్పలేదని, గతంలో ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఎలాంటి సమస్యలు లేవని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్త కారణాలు చూపించడం సరికా దన్నారు.
ఈ వ్యవహారం మొత్తం ఒక పెద్ద భూదందా స్కెచ్‌గా కనిపిస్తోందని, 280 ఎకరాలు స్వాధీనం చేసుకోవడమే అసలు లక్ష్యమని ఆరోపించారు. ఇందులో ప్రజల ప్రయోజనాలు లేవని, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌చేశారు.




