10-02-2026 04:24:02 PM
హైదరాబాద్: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు–2026కు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్, ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ప్రత్యేక ఆశీర్వచనలు అందించారు.