22 April, 2026 | 2:33 PM

Breaking News

గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •  

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

08-04-2026 03:19 PM

హైదరాబాద్: నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Grain Procurement Center) రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) బుధవారం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర అందించడంతో పాటు, మధ్యవర్తుల సమస్యలు లేకుండా నేరుగా కొనుగోలు చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు సులభంగా, పారదర్శకంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.