8 April, 2026 | 5:35 PM

లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని

08-04-2026 03:33 PM

మంథని గాంధీ చౌక్ లో ప్రధాన రహదారి పైనే ద్విచక్ర వాహనాలు, కూలర్లు, ఫ్రిజ్ లు, ఆటో ట్రాలీలు

పట్టించుకోని మున్సిపల్ అధికారులు

మంథని,(విజయక్రాంతి): మొన్నటి వరకు గోదావరిఖని  లక్ష్మీ నగర్ లో కనిపించిన ట్రాఫిక్ కష్టాలు ఇప్పుడు మన మంథని నడిబొడ్డులో ఉన్న గాంధీ చౌక్ లో కనిపిస్తుంది.  మంథని గాంధీ చౌక్ లో రోడ్డుపైనే ద్విచక్ర వాహనాలు, కూలర్లు, ఫ్రిజ్ లు, ఆటో ట్రాలీలు వ్యాపారులు పెడుతుండడంతో మంతిని పట్టణంలో ప్రయాణించే ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంథని బస్టాండు, అంబేద్కర్ చౌకు నుంచి పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే ఇదే రహదారి గుండా ప్రయాణించాలి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి అంబులెన్స్ 108 వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రాఫిక్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న మంథని మునిసిపల్ పాలకవర్గం పట్టించుకోవడంలేదని మంథని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్  అధికారులు స్పందించి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.