12 April, 2026 | 5:47 PM

పార్లమెంటులో బిల్లుకు మద్దతివ్వాలి

12-04-2026 04:09 PM

హైదరాబాద్: మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీలన్నీ కూడా పార్లమెంట్ లో బిల్లుకు మద్దతివ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించే పార్టీలకు మహిళలే గుణపాఠం చెబుతారని, ఆడవాళ్లకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు దశాబ్దాల నాటి కల అని ఆయన తెలిపారు. మహిళ రిజర్వేషన్ బిల్లుతో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చరిత్రాత్మకమని, రాజకీయాలకు అతీతంగా బిల్లుకు మద్ధతివ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మహిళల ఆశలు, ఆకాంక్షలకు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతీక, అంతేకాకుండా పార్లమెంట్ లో మహిళా ప్రాతినిధ్యం పెరిగాల్సిందే అని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ తో పార్లమెంట్ లో స్థానాలు పెరుగుతాయని, ఈ బిల్లుతో తెలంగాణ అసెంబ్లీలో కూడా 60 మంది మహిళలకు అవకాశాలు లభిస్తాయని మంత్రి బండి సంజయ్ సూచించారు.