3 June, 2026 | 5:11 PM

పవన్ పై అడ్లూరి ఫైర్

03-06-2026 04:02 PM

జగిత్యాల,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ నాయకులపై, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో మీడియాతో మాట్లాడుతూ... నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.  పవన్ కళ్యాణ్‌ను నటుడిగా తెలంగాణ ప్రజలు ఎంతగానో అభిమానిస్తారని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. ఇది నా అయ్యా జాగీరా' అని పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలంగాణ అమరుల త్యాగాల వల్ల ఏర్పడిందని, ఎవరి సొంత జాగీరు కాదని స్పష్టం చేశారు