18 March, 2026 | 4:01 AM

శ్రీ భీమేశ్వర స్వామివారి సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

18-03-2026 12:55 AM

వేములవాడ,మార్చి 17,(విజయక్రాంతి )రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర మంత్రి,ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు.తర్వాత స్వామివారి మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ జి. శ్రావణ్ కుమార్ మంత్రికి స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య,వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్,తహసీల్దార్ జయంత్, ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ,ఎడ్ల శివసాయి, జూనియర్ అసిస్టెంట్లు సింహాచారి, నరాల రాజు తదితరులు, ఆలయ సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు.