8 April, 2026 | 5:49 PM

ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు

08-04-2026 03:46 PM

చివ్వెంల,(విజయక్రాంతి): ప్రజలకు బ్యాంకింగ్ సేవలు సులభంగా అందించేందుకు చివ్వెంల మండలంలోని పిల్లలజగ్గు తండాలో మినీ బ్యాంక్ సేవలను ప్రారంభించినట్లు జయరాం గుడితండ సర్పంచ్ వెంకన్న నాయక్ తెలిపారు. ఈ మినీ బ్యాంక్ సేవలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ప్రజలకు అవసరమైన ఉపాధి హామీ నిధులు, పొదుపు సంఘాల లావాదేవీలు వంటి సేవలను ఈ మినీ బ్యాంక్ ద్వారా సులభంగా పొందవచ్చని అన్నారు.

డబ్బులు జమ చేయడం, డ్రా చేయడం వంటి సేవలకు ఎలాంటి అదనపు రుసుములు ఉండవని పేర్కొన్నారు. గ్రామ ప్రజలంతా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవుల నాయక్, సుక్య నాయక్, శ్రీరాములు నాయక్, శ్రీకాంత్ నాయక్, సైదా నాయక్, సీఎస్పీ అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.