22 July, 2026 | 5:18 PM

ఏఐజీ ఆస్పత్రిలో చేరిన బాలకృష్ణ.. హెల్త్ బులెటిన్ విడుదల

22-07-2026 04:13 PM

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. రాజమండ్రి నుంచి ఎయిర్ అంబులెన్సులో బాలయ్య ఏఐజీకి చేరుకున్నారు. నిన్న కాకినాడలో సినిమా షూటింగ్ లో బాలకృష్ణ(Balakrishna) గాయపడ్డారు. ఏఐజీ వైద్యులు బాలయ్యకు ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహించారు. #NBK111 సిన్మా షూటింగ్ లో గాయపడిన బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్(Nandamuri Taraka Rama Rao Jr), దర్శకుడు మలినేని గోపిచంద్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ 

ప్రాథమిక పరిశీలనలో ఎడమ మోకాలి చుట్టూ రక్తం చేరడం, వాపు, కండరం చిట్లి ఉండే అవకాశం ఉన్నట్లు తేలింది. ఆర్థోపెడిక్ నిపుణుల పర్యవేక్షణలో బాలకృష్ణకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనను నిశిత వైద్య పర్యవేక్షణలో ఉంచామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు పూర్తయిన తర్వాత తుది చికిత్సా విధానంపై నిర్ణయం తీసుకుంటారని వైద్యులు వెల్లడించారు.