20 March, 2026 | 3:36 AM

ఆపన్నుల పాలిట ‘మేఘన్న అభయహస్తం’

20-03-2026 12:00 AM

అంత్యక్రియల నుంచి విద్య వరకు, మానవత్వానికి చిరునామా

ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండడం, మాటలకే పరిమితం కాకుండా చేతలతో చూపించడంఇవి మేఘారెడ్డి సేవా ధోరణికి ప్రతీకలు. రాజకీయ నాయకత్వం అంటే ఏమిటో తన కార్యాచరణతో చూపిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మేఘన్న అభయహస్తం’ పేరుతో తన స్వంత ఖర్చులతో ఆర్థిక సహాయం అందిస్తూ మానవత్వాన్ని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చాటుతున్నారు. 

వనపర్తి, మార్చి 19 (విజయక్రాంతి ): ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పు మాటలు చెప్పడం సాధారణం. కానీ ఆపదలో ఉన్న కుటుంబాలకు నిజంగా అండగా నిలిచి సహాయం చేయడం మాత్రం కొందరు ప్రజా ప్రతినిధుల ప్రత్యేకత. అలాంటి అరుదైన నాయకుల్లో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఒకరు. ఎమ్మెల్యేగా అభివృద్ధి పనుల్లో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ, నియోజకవర్గంలో ఎక్కడైనా ఆపద సంభవిస్తే వెంటనే స్పందించడం ఆయన అలవాటుగా మార్చుకున్నారు.

ముఖ్యంగా పేద కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు అంత్యక్రియలు నిర్వహించడానికి ఇబ్బందులు తలెత్తకుండా ‘మేఘన్న అభయహస్తం’ పేరుతో తన స్వంత ఖర్చులతో ఆర్థిక సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. నియోజకవర్గంలో ఎవరైనా మృతి చెందినప్పుడు, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిసిన వెంటనే స్పందించి తన వంతు చేయూత అందించడం ద్వారా బాధిత కుటుంబాలకు ధైర్యం నింపుతున్నారు. దీంతో అనేక కుటుంబాలు తమ బంధువులకు గౌరవప్రదంగా చివరి వీడ్కోలు ఇవ్వగలుగుతున్నాయి.

 గ్రామ స్థాయి నుంచి ప్రజాసేవకు శ్రీకారం. ....

కాంట్రాక్టర్గా ఎదిగిన మేఘారెడ్డి, తనకు ఉన్నంతలో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజా ప్రతినిధులతో కలిసి పనిచేసే సమయంలో, పేద కుటుంబాలు అంత్యక్రియల కోసం కూడా ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు చూసి మనసు కలిచిపోయింది.

ఈ నేపథ్యంలోనే 2011లో మంగపల్లి సర్పంచ్ గా మహిళలకు రావడం గెలవడం తో సర్పంచ్ భర్త గా మొదటగా గ్రామంలో ‘మేఘన్న అభయహస్తం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రారంభంలో అంత్యక్రియలకు మాత్రమే పరిమితమైన ఈ సహాయం, క్రమంగా వివాహాలు, విద్యార్థుల ఉన్నత విద్య వంటి అవసరాలకు విస్తరించింది.

 పదవులు పెరిగినా సేవ తగ్గలేదు .....

సర్పంచ్ భర్త గా ప్రారంభమైన ఆయన సేవా ప్రయాణం, ఎంపీపీగా, అనంతరం ఎమ్మెల్యేగా ఎదిగినా ఎక్కడా మారలేదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అన్న పెద్దల మాటను ఆచరణలో చూపిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలను కొనసాగిస్తున్నారు.‘మేఘన్న అభయహస్తం’ ద్వారా ఇప్పటివరకు వందలాది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారి కష్టకాలంలో మానసికంగా అండగా నిలుస్తూ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

నా కుటుంబ సభ్యులకు అండగా నిలవడం నా బాధ్యత 

నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులు. వారు సంతోషంగా ఉన్న సమయంలో పక్కన ఉండడమే కాదు కష్టాల్లో ఉన్న సమయంలో వారి పక్కన నిలబడడమే ప్రధానం. తాను కాంట్రాక్టర్గా ఎదుగుతున్న సమయంలో ఆపదలను కండ్లరా చూసి చలించిపోయి తనకు తోచిన సహాయం చేసేవాడిని. ప్రజలు ఆశీర్వదించి గ్రామ సర్పంచ్ గా మా సతీమణి గెలిపించడం జరిగింది.

నన్ను ఆదరించే ప్రజలకు ఎల్లపుడు అండగా ఉండాలన్న కోరిక నుండే మేఘన్న అభయహస్తం కార్యక్రమం కు శ్రీకారం చుట్టింది. అప్పటి నుండి నేటి వరకు ప్రజల కష్ట సుఖాల్లో తన వంతు సహాయం ను అందచేయడం దినచర్యలో భాగమైంది. తాను రాజకీయంగా ఎదగడం కాదు ప్రజలకు ఎంత మేరలో అందుబాటులో ఉన్నామన్నదే నా అభిప్రాయం

 తూడి మేఘారెడ్డి, వనపర్తి శాసనసభ్యులు