"హర్ ఘర్ తిరంగా" ప్రతి ఇంటికి తీసుకు వెళ్ళాలి
నేరేడుచర్ల,(విజయక్రాంతి): దేశభక్తి భావాన్ని ప్రతి ఇంటికి చేర్చే మహత్తర కార్యక్రమమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమమని సూర్యాపేట జిల్లా భాజపా కో-కన్వీనర్ నందిపాటి హిందూజా పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు. శనివారం నేరేడుచర్లలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూజా మాట్లాడుతూ... మన దేశ సమైక్యత, జాతీయ సమగ్రతను బలోపేతం చేయడం ప్రతి భారతీయుడి భాధ్యత అని, విద్యార్థులు,మేధావులు ,ప్రజాసంఘాలు దేశ భక్తి భావాలను పెంపొందించే కార్యక్రమాలలో భాగస్వాములు కావాలి.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేల ప్రజలలో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని,మన పట్టణంలో నిర్వహించే తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చింతకుంట్ల రాజేష్ రెడ్డి , నరి నాయక్ , కుక్కడపు వెంకటేశ్వర్లు,వేమిరెడ్డి శంకర్ రెడ్డి,జిల్లా నాయకులు సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి, ఊర్మిళ రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి కాలం నాగయ్య, విజయ్ రెడ్డి, సీనియర్ నాయకులకు కొప్పు లక్ష్మీనారాయణ, గుడ్డేటి పవన్, సోమనబోయిన మురళీకృష్ణ , చెంచల కిరణ్, నరేందర్ నాయక్, శక్తికేంద్రం ఇన్చార్జిలు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






