8 August, 2026 | 7:13 PM

ఎగువ మానేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

08-08-2026 05:50 PM

తహసిల్దార్ మారుతి రెడ్డి హెచ్చరిక

గంభీరావుపేట,(విజయక్రాంతి): గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ మారుతి రెడ్డి సూచించారు. వరద నీరు ఎగువ మానేరు ప్రాజెక్ట్ మత్తడి పైనుండి వచ్చే అవకాశం ఉన్నందున వాగు పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రత్యేకంగా వాగు వైపు ఎవరూ వెళ్లకూడదని, వాగు పరిసరాల్లో పశువులను అవతలి గట్టుకు మేతకు తీసుకెళ్లడం లేదా కట్టివేయడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. అలాగే మేకలు, గొర్రెల కాపర్లు కూడా వాగు వైపు మేత కోసం వెళ్లకుండా ఉండాలని సూచించారు.